Surprise Me!

AP Public Talk 2025 | వ్యవస్థలన్నీ నాశనం చేశావ్. మళ్లీ కోర్టుకు పిలవాలంటే భయపడేలా చేశావ్ | Oneindia

2025-11-22 101 Dailymotion

అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. జగన్ కోర్టుకు హాజరైన తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక నుంచి జగన్ కోర్టుకు హాజరవ్వాల్సిందేనని, సీఎం అయ్యాక విచారణకు దూరం జరిగిన వ్యక్తి నేడు కచ్చితంగా కేసులు ఎదుర్కోవాల్సిందేనని అంటున్నారు. ఆరేళ్ల త‌ర్వాత కోర్టుకు హాజ‌రైన ఎమ్మెల్యే జ‌గ‌న్ భ‌విష్య‌త్తులో కోర్టు వాయిదాల‌కు హాజ‌రు కాకుండే వుండేందుకు కోర్టు వెలుప‌ల ఊరేగింపు డ్రామాలు చేశాడ‌న్నారు. వైసిపి నాయ‌కుల‌కు జైలు నుంచి వ‌చ్చే స‌మ‌యంలో, కోర్టుల‌కు హాజ‌ర‌య్యే స‌మయంలో పెయిడ్ బ్యాచ్ తో ఊరేగింపులు నిర్వ‌హించుకోవ‌టం అల‌వాటుగా మారింద‌న్నారు. హైద‌రాబాద్ లో ఊరేగింపు నిర్వ‌హించ‌టానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జ‌నాలు భారీగా త‌ర‌లించార‌న్నారు. జ‌గ‌న్ ను చూడ‌టానికి అభిమానులు హైద‌రాబాద్ వ‌స్తే...మ‌రి గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ కి వ‌చ్చిన‌ప్పుడు అభిమానులు ఎందుకు క‌నిపించ‌టం లేదు...ఎవ‌రు స్వాగ‌తం ఎందుకు చెప్ప‌టం లేదో స‌మాధానం చెప్పాలంటూ ఎమ్మెల్యే జ‌గ‌న్ ను సూటిగా ప్ర‌శ్నించారు.

Former Chief Minister and YSRCP President Y.S. Jagan Mohan Reddy appeared before the CBI Special Court in the illegal assets case, triggering heated political discussions. After nearly six years, Jagan’s court appearance and the massive rally outside have sparked strong criticism from TDP leaders.

TDP alleges that Jagan staged a dramatic show outside the court, used a paid batch for the rally, and questioned why no supporters were seen at Gannavaram Airport if people truly came to see him.

#Jagan #Ysjagan #CBICourt #APPolitics #TDP #YSRCP #JaganCase #PoliticalNews #AndhraPradesh #BreakingNews #JaganUpdates #HyderabadNews #CBI

~HT.286~ED.232~PR.358~

Buy Now on CodeCanyon